: డాలర్ల మిస్సింగ్ కేసులో డాలర్ శేషాద్రికి ఊరట!
తిరుమల శ్రీవారి ఆలయంలో డాలర్ల కుంభకోణం కేసులో ఆలయ ఓఎస్ డి డాలర్ శేషాద్రికి ఊరట లభించింది. డాలర్ శేషాద్రితో పాటు డిప్యూటీ ఈవో హోదాలో రిటైర్ అయిన వాసుదేవన్ పై శాఖాపరమైన చర్యలు నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, 2007లో 300 బంగారు డాలర్లు కనిపించకపోవడంతో డాలర్ శేషాద్రి, అప్పటి డిప్యూటీ ఈవోపై టీటీడీ చర్యలు తీసుకుంది.