: త్వరలోనే విడుదల కానున్న కొత్త రూ.50 నోట్లు ఇలా ఉంటాయట.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
కొత్తగా రూ.50, రూ.20 నోట్లను విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్‌బీఐ విడుదల చేయనున్న ఈ కొత్త నోట్లు సరికొత్తగా ఉండనున్నాయని సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలు వైరల్ అవుతున్నాయి. కొత్త రూ.50 నోటుకు సంబంధించిన కొన్ని నోట్ల కట్టలు ఆ చిత్రాల్లో కనపడుతున్నాయి. వీటి రంగు కూడా ఇప్పుడున్న రూ.50 నోట్ల కంటే పూర్తి భిన్నంగా ఉంది. ఈ నోట్ల వెనుక దక్షిణ భారతానికి చెందిన ఓ ఆలయం ఫొటో కూడా ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ నోట్లు విడుదల కానున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.