: తెలంగాణలో ఈ రోజు నమోదైన వర్షపాతం వివరాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు వర్షాలు కురిశాయి. వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు చూస్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్ లో 4.3 సెం.మీ, దమ్మపేటలో 3.9 సెం.మీ, భద్రాచలంలో 3.5 సెం.మీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏటూరు నాగారంలో 5.7 సెం.మీ, కన్నాయి గూడెంలో 5.3 సెం.మీ, మంగపేటలో 3.9 సెం.మీ, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో 3.3 సెం.మీ, చింతకానిలో 3.2 సెం.మీ వర్షం పడిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని పలుచోట్ల కూడా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.