: జగన్ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది: శిల్పామోహన్ రెడ్డి
జగన్ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని నంద్యాల ఉపఎన్నికలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి అన్నారు. నంద్యాలలోని స్థానిక మసీదు సెంటర్ లో నిర్వహించిన రోడ్ షోలో శిల్పామోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఓటర్లు భయపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓ వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ఓటర్లు ఓటు వేయడంలేదని, మూడున్నరేళ్ల చంద్రబాబు పాలనపై, అన్యాయాలపై ఓటు వేస్తున్నామని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. తాను, తన సోదరుడు టీడీపీకి, తమ పదవులకు రాజీనామా చేసి వైసీపీలో చేరామని, మరి, వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు తమ పదవులకు ఎందుకు రాజీనామా చేయరని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యేలకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేసి గెలవాలని అన్నారు.