: పని ఒత్తిడిని అధిగమించాలంటే వ్యాయామం చేయాల్సిందే: సినీ నటుడు నాగార్జున
రోజూ వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యం అవుతుందని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ ఫీనిక్స్ ఐటీ సెజ్ లో మొట్టమొదటిసారిగా ఆ గ్రూపు భాగస్వామ్యంతో కాల్ హెల్త్ లాంజ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, ఆయన సతీమణి అమల పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ప్రతిరోజూ వ్యాయామానికి అరగంట సమయం కేటాయిస్తే కనుక, ఎలాంటి పని ఒత్తిడి బారిన పడమని అన్నారు. ‘కాల్ హెల్త్ లాంజ్’లో ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితులపై పర్యవేక్షణ ఉంటుందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.