: భూమా ఫ్యామిలీకే సపోర్ట్ చేయాలని పవన్ కల్యాణ్ మనసు నిండా ఉంది: వేణుమాధవ్


నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి తాను మద్దతు ఇవ్వనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ‘పవన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరు ఏమంటారు?’ అని హాస్యనటుడు వేణుమాధవ్ ను మీడియా ప్రశ్నించగా.. ‘కొన్ని కొన్ని విషయాలు పైకి చెప్పడానికి వీల్లేని పరిస్థితులు ఉంటాయి. పవన్ కల్యాణ్ గారు, ప్రచారానికి రాకపోవచ్చు గానీ, భూమా ఫ్యామిలీకే సపోర్ట్ చేయాలని ఆయన మనసు నిండా ఉందని నా నమ్మకం.. సినీ ఇండస్ట్రీతో భూమా ఫ్యామిలీ కి చాలా అటాచ్ మెంట్ ఉంది.

కాబట్టి, వాళ్లు బయటకు చెప్పకపోయినప్పటికీ అంతర్గతంగా చూస్తే వాళ్లందరూ భూమా బ్రహ్మానందరెడ్డికే మద్దతు ఇస్తారు. కచ్చితంగా, బ్రహ్మానందరెడ్డి విజయం సాధిస్తాడు. బ్రహ్మానందరెడ్డి కి ముప్పై వేలు, నలభై వేలు.. ఇలా మెజార్టీ వస్తుందని అంటున్నారు. బ్రహ్మానందరెడ్డి పోటీ పడుతున్న వారికి డిపాజిట్ కూడా దక్కదనే వార్తలు వింటున్నాను. భూమా బ్రహ్మానందరెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టడం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం’ అని వేణుమాధవ్ అన్నాడు.

  • Loading...

More Telugu News