: గువాహటి రైల్వేస్టేషన్‌లో టైమర్ అమర్చిన 10 కేజీల మందుపాతర గుర్తింపు
అసోంలోని గువాహటి రైల్వే స్టేషన్ సిబ్బంది ఓ గోనె సంచిలో 10 కేజీల మందుపాతరను గుర్తించారు. రైల్ మెయిల్ సర్వీస్ ద్వారా రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చిన పార్శిళ్లను పరిశీలిస్తుండగా ఓ గోనె సంచిలో నుంచి టిక్ టిక్ మంటూ శబ్దం వచ్చిందని, దీంతో ఈ విషయంపై వెంటనే పోలీసులకు సమాచారం అందించామని అక్కడి సిబ్బంది తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అందులో మందుపాతర ఉన్నట్లు గుర్తించారు. అంతేగాక, దుండగులు దానికి టైమర్‌ను కూడా అమర్చినట్లు పోలీసులు చెప్పారు. ఒకవేళ అది పేలి ఉంటే 100 మీటర్ల వరకు ప్రభావం చూపేదని అన్నారు. ఆ మందుపాతరను నిర్వీర్యం చేశామని, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని అన్నారు.