: నోయిడాలో నిర్మాణంలో ఉన్న స్కూల్ భవనం సీలింగ్ కూలింది.. శిథిలాల కింద 14 మంది!


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడాలో ఈ రోజు ప్ర‌మాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ పాఠ‌శాల‌ భ‌వ‌న సీలింగ్ ఒక్క‌సారిగా కూలిపోవ‌డంతో అందులో ప‌నిచేస్తోన్న కార్మికులు శిథిలాల కిందే మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. శిథిలాల కింద మొత్తం 14 మంది ఉన్నార‌ని అక్క‌డి అధికారులు తెలిపారు. ప‌లువురిని ఇప్ప‌టికే ర‌క్షించి, ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని అన్నారు.  

  • Loading...

More Telugu News