: రానా ప్రధాన పాత్రలో `సోషల్` వెబ్ సిరీస్!
ఈ మధ్య డిజిటల్ మీడియాలో వెబ్ సిరీస్‌ల హవా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రానా ప్రధాన పాత్రలో త్వరలో ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. `సోషల్` అనే పేరుతో నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో మరో నటుడు నవీన్ కస్తూరియా కూడా ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ `వియూ` సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థలో `నెం. 1 యారి` అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాకు విపరీతంగా అలవాటు పడిన యువతరం ఎదుర్కుంటున్న సమస్యల నేపథ్యం కథాంశంతో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్‌ను `వియూ` వెబ్ ఛానల్‌లో ప్రసారం చేయనున్నారు.