: విశాల్ సిక్కా మొదట్నుంచీ కంపెనీ ప్రమాణాలను కాలరాస్తూ వచ్చాడు!: నారాయణమూర్తి
ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా రాజీనామా చేయడానికి తానే కారణమంటూ వస్తున్న ఆరోపణలపై వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ నారాయణ మూర్తి స్పందించారు. సరైన సమయం వచ్చినపుడు తనపై వస్తున్న ఆరోపణలకు సరైన సమాధానం చెబుతానని ఆయన గట్టిగా బదులిచ్చాడు. రాజీనామాకు తానే కారణమంటూ సిక్కా చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని ఆయన అన్నారు. అలాంటి ఆరోపణలకు సమాధానం చెప్పడం వల్ల తన గౌరవం దెబ్బతింటుందని నారాయణ చెప్పారు. విశాల్ సిక్కా మొదట్నుంచీ కంపెనీ ప్రమాణాలను కాలరాస్తూ వచ్చాడని ఆయన పేర్కొన్నారు. అలాగే తనకు డబ్బు పైన గానీ, పదవి పైన గానీ ఎలాంటి వ్యామోహం లేదని నారాయణ మూర్తి స్పష్టం చేశారు. ఈ విషయాలన్నిటినీ నారాయణ మూర్తి లిఖిత పూర్వకంగా తెలియజేశారు.