: సుభాష్ చంద్ర‌బోస్ జీవిత క‌థ‌తో వ‌స్తున్న వెబ్‌సిరీస్ `బోస్` ట్రైల‌ర్ విడుద‌ల


స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు సుభాష్ చంద్ర‌బోస్ మ‌ర‌ణం మిస్ట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన వెబ్‌సిరీస్ `బోస్: డెడ్ ఆర్ ఎలైవ్‌` ట్రైల‌ర్ విడుద‌లైంది. `బోస్ చ‌నిపోయాడ‌ని ప్ర‌పంచం అనుకుంటోంది. ఇది నిజ‌మా? కాదా?` అంటూ ఊరించిన ఈ వెబ్‌సిరీస్ ఫ‌స్ట్‌లుక్‌తో పాటు ఇప్పుడు విడుద‌లైన ట్రైల‌ర్ కూడా ఈ వెబ్‌సిరీస్‌పై అంచ‌నాల‌ను పెంచుతోంది. ఇందులో బోస్‌గా బాలీవుడ్ న‌టుడు రాజ్‌కుమార్ రావ్ న‌టిస్తున్నాడు.

 `నాకు ర‌క్తాన్ని ఇవ్వండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను` అన్ని విప్ల‌వ‌యోధుడు బోస్ తర్వాత నేతాజీగా ఎలా మారాడు? ఆయ‌న‌ మ‌ర‌ణం వెన‌క ఉన్న కార‌ణాలేంటి? వంటి ప్ర‌శ్న‌ల‌కు ఈ వెబ్‌సిరీస్‌లో స‌మాధానాలు దొర‌క‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఏక్తా క‌పూర్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సిరీస్‌కి పుల్కిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. త్వ‌ర‌లో ఈ సిరీస్ `ఏఎల్‌టీ బాలాజీ` వెబ్ ఛానల్‌లో ప్ర‌సారం కానుంది.

  • Loading...

More Telugu News