: జగన్, శిల్పా మోహన్ రెడ్డి చెరో రూ.50 కోట్లు డంప్ చేశారు: ఎంపీ జేసీ ఆరోపణ
ఉపఎన్నికల నిమిత్తం జగన్, శిల్పా మోహన్ రెడ్డి చెరో రూ.50 కోట్లు నంద్యాలలో డంప్ చేశారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు.. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నంద్యాలలో ఇంత హంగామా అవసరం లేదని, ప్రజల్లో నమ్మకం లేని వ్యక్తి ఎంత తిరిగినా ఏముంటుందంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ కు మీడియా మద్దతు లేదని నిరూపిస్తే, ఎన్నికల నుంచి తాము విత్ డ్రా చేసుకుంటామని అన్నారు. ‘మహానేత’ అంటూ 24 గంటలూ అరిగిపోయిన రికార్డులు వేస్తున్నారని, జీవితంలో జగన్ సీఎం కాలేరని అన్నారు.