: 'రేమాండ్' విజయ్ పథ్ సింఘానియాకు గుండెపోటు!


తన కుమారుడికి సర్వస్వమూ ఇచ్చి, అనాథగా మిగిలిపోయి, తన జీవనం కోసం న్యాయ పోరాటం చేస్తున్న 'రేమాండ్' వ్యవస్థాపకుడు విజయ్ పథ్ సింఘానియాకు గుండెపోటు వచ్చింది. దక్షిణ ముంబైలోని ఓ క్లబ్ లో ఆయన ఉన్న వేళ, తనకు తీవ్రమైన గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో, ఆయన్ను హుటాహుటిన ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మరిన్ని వైద్య పరీక్షలు జరుపుతున్నామని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

48 గంటల పాటు ఆయన్ను అబ్జర్వేషన్ లో ఉంచాలని నిర్ణయించామని, రక్తపోటు చాలా ఎక్కువగా ఉందని సింఘానియాకు వైద్యం అందిస్తున్న డాక్టర్ హేమంత్ థాకర్ వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయన గుండెనొప్పితో ఆసుపత్రికి వచ్చిన సమయంలో రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నట్టు కనుగొన్నామని, ఆపై మార్చిలో లండన్ లో ఆయనకు కరోనరీ బైపాస్ సర్జరీ జరిగిందని తెలిపారు. వైద్య పరీక్షల తరువాత ఆయన ఆరోగ్యంపై స్పష్టమైన ప్రకటన చేస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News