: డోక్లాం వివాదానికి నిర‌స‌న‌గా సిడ్నీలో చైనీస్ ఆస్ట్రేలియ‌న్ల కార్ ర్యాలీ


గ‌త రెండు నెల‌లుగా భారత్ - చైనా దేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న డోక్లాం వివాదానికి నిర‌స‌నగా ఆస్ట్రేలియాలో నివ‌సిస్తున్న చైనీయులు కార్ ర్యాలీ నిర్వ‌హించారు. భార‌త స్వాతంత్ర్య దినోత్స‌వం నాడు సిడ్నీలోని చైనా టౌన్ నుంచి భార‌త రాయ‌బార కార్యాల‌యం వ‌ర‌కు కార్ల ర్యాలీ చేప‌ట్టారు. `చైనా స‌రిహ‌ద్దు దాటితే యుద్ధం త‌ప్ప‌దు!`, `భార‌త్ అంతు చూస్తాం!` అంటూ నినాదాలు చేస్తూ, కార్ల‌పై ప్ల‌కార్డులు త‌గిలించుకుని ఈ ర్యాలీ నిర్వ‌హించారు.

ఈ ర్యాలీలో ఉన్న‌త శ్రేణి కార్లైన బీఎండ‌బ్ల్యూ, లాంబోర్గ‌నీ, బెన‌టెలీ, ఆడి కార్లు పాల్గొన్నాయి. భార‌త రాయ‌బార కార్యాల‌యం చేరుకున్న త‌ర్వాత త‌మ కార్ల‌తో చైనీయులు విన్యాసాలు చేశారు. ఇదిలా ఉండ‌గా రెండు నెల‌లు పూర్తి కావొస్తున్నా డోక్లాం స‌రిహ‌ద్దు వివాదంపై ఇంకా ఎలాంటి పరిష్కారం లభించలేదు. 

  • Loading...

More Telugu News