: నా ప్రేమ నిజమైనది... మళ్లీ బిగ్ బాస్ షోలోకి రాను!: తమిళ బిగ్ బాస్ అభిమానులకు ఓవియా సందేశం!


తమిళ బిగ్‌ బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలోకి మళ్లీ వచ్చేది లేదని నటి ఓవియ స్పష్టం చేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం అభిమానులనుద్దేశించి మాట్లాడిన వీడియో పోస్టు చేసింది. అందులో బిగ్ బాస్ షోలో తనను ఇబ్బంది పెట్టినవారిని ద్వేషించొద్దని సూచించింది. బిగ్‌ బాస్‌ షోలో తనకెదురైన అనుభవాలు, తాను బయటకు వెళ్లిపోవడానికి దారి తీసిన పరిస్థితులు, ఆరవ్‌ తో తన ప్రేమాయణం, తాజాగా మారిన తన హెయిర్‌ స్టైల్‌ గురించి వివరించింది. ప్రేమ పట్ల తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పింది. అలాగే తనది స్వచ్ఛమైన ప్రేమ అని స్పష్టం చేసింది. బిగ్‌ బాస్‌ లోంచి తాను బయటకు వచ్చేసేందుకు కారణమైన జూలీ, శక్తిలను కార్నర్‌ చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

ఎందుకంటే అలా వివక్ష చూపించడాన్ని తాను అనుభవించానని చెప్పింది. అందుకేవారి పట్ల వివక్ష చూపవద్దని కోరింది. తప్పులు చేయడం సహజమని, తాను కూడా తప్పులు చేస్తుంటానని చెప్పింది. ఎవరూ పర్ ఫెక్ట్ కాదని చెప్పింది. అందుకే వారిని లక్ష్యంగా చేసుకోవద్దని సూచించింది. తన అభిమానులు అలా చేయడం అస్సలు ఇష్టం ఉండదని, వారలా చేయకూడదని తెలిపింది. కేరళలోని కొచ్చిలో ఆనందంగా గడుపుతున్నానని చెప్పిన ఓవియా... తన హెయిర్ ను కేన్సర్ బాధితులకు ఇచ్చేశానని, అందుకే హెయిర్ స్టైల్ మార్చేశానని తెలిపింది. కాగా, బిగ్ బాస్ షోలో ఓవియాకు మంచి ఆదరణ లభించడం విశేషం. 

  • Loading...

More Telugu News