: వరుసగా నాలుగో వారం నెం.1 స్థానంలో `స్టార్ మా`... కారణం బిగ్‌బాస్!
వారాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా `స్టార్ మా` ఛానల్‌లో ప్రసారమవుతున్న `బిగ్‌బాస్` కార్యక్రమం వల్ల వరుసగా నాలుగో వారం నెం. 1 స్థానంలో 'స్టార్ మా' ఛానల్ నిలిచింది. `రానా` అతిథిగా వచ్చిన ఎపిసోడ్‌కు కూడా మంచి రేటింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. వారాంతం ఎపిసోడ్లతో పోల్చినపుడు మిగతా ఎపిసోడ్లకు పెద్దగా ఆదరణ లభించడం లేదని రేటింగ్స్ ద్వారా స్పష్టమవుతోంది. ఈ కారణంతోనే ఇటీవల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హీరో నవదీప్‌ను బిగ్‌బాస్ ఇంట్లోకి పంపినట్లు సమాచారం. నవదీప్ చరిష్మా ఎంత మాత్రం పనిచేసిందో తెలుసుకోవాలంటే ఈ వారం రేటింగ్స్ వచ్చేదాక ఎదురుచూడాల్సిందే!