: ట్రెక్కింగ్, ట్రావెలింగ్ కోసం బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం వదిలేసింది!
తనకు ఎంతో ఇష్టమైన ట్రెక్కింగ్, ట్రావెలింగ్ కోసం 24 ఏళ్లుగా చేస్తున్న బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది హైదరాబాద్‌కు చెందిన స్మితా ఛటర్జీ. ఇటీవల హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లను కలుపుతూ 17,300 అడుగుల ఎత్తు ఉన్న లంఖాగా పర్వత శ్రేణిని అధిరోహించి, ఈ పర్వతం ఎక్కిన తక్కువ మంది మహిళల్లో ఒకరిగా ఆమె నిలిచింది. తాను బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసేటపుడు సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే సెలవు లభించేదని, దీంతో కొంత డబ్బు వెనకేసుకుని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చినట్లు స్మితా తెలిపారు.
అలాగే లంఖాగా శ్రేణిని అధిరోహించేటపుడు చాలా కష్టపడినట్లు, కానీ ట్రెక్కింగ్‌పై తనకున్న ఇష్టం వల్ల సులభంగా అధిరోహించగలిగినట్లు స్మితా వివరించారు. ఇప్పటివరకు ఈ పర్వత శ్రేణిని అధిరోహించిన అతి తక్కువ మంది మహిళల్లో తాను స్థానం సంపాదించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. త్వరలో పశ్చిమ కనుమలను కూడా అధిరోహించేందుకు తాను ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు స్మితా తెలియజేశారు.