filmibeat: స్టేజ్ పైకి మహేశ్ ఎలా వస్తాడు? .. ఎలా కనిపిస్తాడు?


మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు చేసిన 'స్పైడర్' చిత్రం, తెలుగుతో పాటు తమిళంలోను ఒకేసారి విడుదల కానుంది. మహేశ్ బాబు తమిళంలో నేరుగా చేసిన మొదటి సినిమా ఇదే. అందువలన వచ్చే నెల 9న చెన్నైలో ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసి .. ఆ వేదికపై మహేశ్ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పలువురు సినీ ప్రముఖులు ..  అభిమానుల సమక్షంలో ఈ వేడుకను గ్రాండ్ గా జరపాలని నిర్ణయించుకున్నారు.

ఈ వేదికపైకి మహేశ్ ఎలా వస్తాడు? .. ఎలా కనిపిస్తాడు? అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సరిగ్గా ఆ విషయం పైనే ఈ సినిమా యూనిట్ ఫోకస్ చేసిందట. స్టేజ్ పైకి మహేశ్ ఎంట్రీ ఎలా ఉండాలి? .. ఆయన ఎలా కనిపించాలి? అనే విషయాలను చాలా కొత్తగా డిజైన్ చేశారని సమాచారం. మహేశ్ ఇంట్రడక్షన్ కోసం రూపొందించిన స్పెషల్ కాన్సెప్ట్ తమిళ ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని అంటున్నారు. చెన్నైలో జరగనున్న ఈ ఈవెంట్ కోసం తెలుగు అభిమానులతో పాటు తమిళ వాసులంతా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు.      

  • Loading...

More Telugu News