: 2019 వరల్డ్ కప్ ఫైనల్ లో పాక్ తో ఆడాలి.. విన్నింగ్ షాట్ నేను కొట్టాలి... నా కూతురు కేరింతలు కొట్టాలి: టీమిండియా క్రికెటర్ ఆశ


2019 క్రికెట్‌ వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా లేదా పాకిస్థాన్‌ తో భారత్‌ తలపడాలి... నేను ఫోర్‌ కొట్టి భారత్‌ కు విజయం అందించాలి.. దానిని చూసి గ్యాలరీలో ఉన్న నా కుమార్తె కేరింతలు కొట్టాలి. త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి... అంటూ టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా ఆశపడుతున్నాడు. తనకు తన కుమార్తె గ్రేసియా అంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. అదే సమయంలో దేశం తరపున ఆడడం కూడా చాలా ఇష్టమని చెప్పాడు. మరో నాలుగైదేళ్లు తాను క్రికెట్ లో కొనసాగుతానని, తానేనిర్ణయం తీసుకున్నా తన భార్య మద్దతు తెలుపుతుందని రైనా తెలిపాడు. కాగా, 'యోయో' పరీక్షలో విఫలమై శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు సురేష్ రైనా ఎంపిక కాని విషయం విదితమే. 

  • Loading...

More Telugu News