: హైదరాబాదు హోటల్ లో టూరిస్టు గ్యాంగ్ రేప్ ఘటనలో ఐదుగురి అరెస్టు...తుపాకీ స్వాధీనం


హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని ఓయో హోటల్ లో టూరిస్టుపై గ్యాంగ్ రేప్ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదు నగరాన్ని సందర్శించేందుకు ఈ నెల 5వ తేదీన ఢిల్లీ నుంచి ఒక యువతి (20) వచ్చింది. ఆమె ఆన్ లైన్ లో బంజారాహిల్స్ లోని ఓయో హోటల్ లో రూంను బుక్ చేసుకుంది. ఆమె ఒంటరిగా ఉండడం గమనించిన హోటల్ సిబ్బంది, రాత్రి 9 గంటల సమయంలో లిఫ్ట్ లో వేధించారు. దాంతో వారి బారి నుంచి తప్పించుకుని రూంకు చేరింది.

మళ్లీ తెల్లవారు జాము 4 గంటల సమయంలో రూం కాలింగ్ బెల్ కొట్టడంతో లేచిన ఆమె 'ఎవరు?' అని ప్రశ్నించడంతో 'రూం బొయ్' అని సమాధానం విని తలుపులు తీసింది. దీంతో వెటనే ఆమె రూంలోకి దూరిన నలుగురు హోటల్ సిబ్బంది తుపాకీ చూపించి బెదింరించి ఆమె కాళ్లు, చేతులు కట్టేసి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, హోటల్ లో రూం బాయ్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నలుగురూ హోటల్ సిబ్బంది అని తేలింది. వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. 

  • Loading...

More Telugu News