: విశాల్ సిక్కా రాజీనామా ఎఫెక్ట్... పాతాళానికి ఇన్ఫోసిస్ ఈక్విటీ


ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ కు ఎండీ అండ్ సీఈఓగా ఉన్న డాక్టర్ విశాల్ సిక్కా రాజీనామా చేశారన్న వార్త బయటకు వచ్చిన తరువాత, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా, సంస్థ ఈక్విటీ విలువ పాతాళానికి పడిపోయింది. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభమైన క్షణాల వ్యవధిలోనే కిందకు జారిపోయిన ఈక్విటీ, ఉదయం 9:55 గంటల సమయంలో 7 శాతానికి పైగా నష్టంలో కొనసాగుతోంది.

ఇటీవలి కాలంలో తొలిసారిగా సంస్థ ఈక్విటీ విలువ రూ. 950 స్థాయి వద్ద మద్దతు కోల్పోయింది. ప్రస్తుతం సంస్థ వాటా విలువ రూ. 946 వద్ద కొనసాగుతోంది. సిక్కా రాజీనామా నిర్ణయం ఇన్ఫీపై పెను ప్రభావాన్నే చూపిందని మార్కెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 0.7 శాతం పడిపోయి 31,574 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇన్ఫీ ప్రభావంతో ఐటీ ఇండెక్స్ భారీ నష్టాల్లో సాగుతోంది.

  • Loading...

More Telugu News