: ఐక్యరాజ్యసమితి మాపై విధించిన ఆంక్షలకు సమాధానం ఇదే!: ఉత్తరకొరియా పోస్టర్ల యుద్ధం
ఐక్యరాజ్యసమితి తమపై విధించిన ఆంక్షలకు తమ సమాధానం ఇదే అంటే ఉత్తరకొరియా పోస్టర్లు విడుదల చేసింది. గతంలో అమెరికాపై దాడులు చేసినట్టు వీడియో తయారు చేసిన ఉత్తరకొరియా తాజాగా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఉత్తరకొరియా క్షిపణులు అమెరికాలోని లక్ష్యాలను చేరుకోగలవని సూచిస్తూ, కొన్ని నగరాలను ధ్వంసం చేస్తున్న పోస్టర్లను రూపొందించి విడుదల చేశారు. ఈ పోస్టర్లపై అమెరికాలోని పట్టణాల పేర్లు, గువామ్ ద్వీపం పేరు రాసి ఉన్నాయి. వాటిపై మరికొన్ని పోస్టర్లలో ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలకు ఇదే సమాధానం అంటూ పేర్కొన్నారు.