: గంటల వ్యవధిలో స్పెయిన్ లో రెండో ఉగ్రదాడి... నలుగురు ఉగ్రవాదుల కాల్చివేత


స్పెయిన్ లోని బార్సిలోనాపై ఉగ్రదాడిని జరిపి 13 మంది ప్రాణాలను బలిగొన్న ఘటనను మరువకముందే గంటల వ్యవధిలో ఉగ్రవాదులు రెండోసారికి ప్రయత్నించగా, భద్రతాదళాలు అడ్డుకున్నాయి. క్యాంబ్రిల్స్ లో భారీ దాడికి ఉగ్రవాదులు ప్రయత్నించగా, అప్పటికే దేశవ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన సైన్యం, భద్రతా దళాలు, నలుగురు అనుమానిత ఉగ్రవాదులను హతమార్చారు. బార్సిలోనా ఘటనను పునరావృతం చేయడమే లక్ష్యంగా ఈ దుశ్చర్యకు పూనుకోగా, వారిని నిలువరించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

 దీంతో వారిపై పోలీసులు తుపాకులు ఎక్కు పెట్టాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు కూడా ప్రతిగా కాల్పులు జరపడంతో ఓ పోలీసు మరణించినట్టు పేర్కొన్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రమూకలే ఈ రెండు ఘటనల వెనుకా ఉన్నాయని అన్నారు. బార్సిలోనా దాడికి పాల్పడిన ఉగ్రవాది చిత్రాన్ని అధికారులు విడుదల చేశారు. బార్సిలోనా దాడిలో 100 మందికి పైగా గాయపడగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగానే ఉందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సను అందిస్తున్నామని అన్నారు.

ఇక బార్సిలోనాకు 200 కిలోమీటర్ల దూరంలోని ఆల్కనార్ అనే ప్రాంతంలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించగా, ఒకరు మరణించారని, మరొకరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అయితే, గ్యాస్ లీక్ కారణంగానే ఇది జరిగి ఉండవచ్చని తొలుత భావించామని, ఇప్పుడు ఉగ్రవాదులతో లింక్ ఉండివుండవచ్చని అనుమానిస్తున్నామని వెల్లడించారు. 

  • Loading...

More Telugu News