: బాలయ్య నోట 'మద్యం దండకం'... బీరువై, బ్రాందివై, విస్కీవై, రమ్మువై, జిన్నువై, కాక్ టేలువై, గుడుంబావై... అంటుంటే కేరింతలు


తనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టమని, అది ఎటువంటిదైనా ఆస్వాదిస్తానని చెప్పిన హీరో నందమూరి బాలకృష్ణ మద్యంపై ప్రాచుర్యంలో ఉన్న ఓ దండకాన్ని స్వయంగా ఆలపించి, తన అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. ఎక్కడో మందు మీద చదివిన ఓ పద్యం తననెంతో ఆకర్షించిందని అన్నారు.
"ఓ బ్రాందీ, ఓ విస్కీ, ఓ రమ్ము ఎంతో రుచిరా... ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా...
పాల మీగడలకన్నా, పంచదార చిలకలకన్నా, ఓ సారా నీ నామ మెంతో రుచిరా...
ఓ సారా దేవా... నీవు బీరువై, బ్రాందివై, విస్కీవై, రమ్మువై, జిన్నువై, కాక్ టేలువై, గుడుంబావై, నాటు సారావై, డైలీ దేవుండవై, సంపూర్ణ మత్తు సిద్ధివై, రసస్ఫూర్తివై, రసాధి దేవతవై..."  
"ఆల్కహాలువై, ఈతకల్లువై, తాటికల్లువై, ద్రాక్షసారావివై, మందు నామాంతరమ్మువై, ప్రత్యక్ష దైవంబువై వచ్చి, మా నాల్కపై నిలిచి, మా గొంతులో జారి, ఉదరమ్ములో కొలువుండి, ఆకలి బాధలు తప్పించి, ఈతి బాధలు మరిపించి, తారతమ్యాలు లేవనుచు మాకు బ్రహ్మానందమ్ము ప్రసాదించుము. ఓ దేవా, ఓ సారా దేవా... నమస్తే నమస్తే నమః" ఈ సాహిత్యంతో తాను కనెక్ట్ అయ్యాననని చెప్పుకొచ్చారు.

 'పైసా వసూల్'లో తాను పాడిన పాట 'శివశంకరి...' పాట అన్నట్టు తాను ఫీల్ అయ్యానని, ఇది తాగుడు పాట కావడంతో చాలా సులువుగానే పూర్తయిందని అన్నారు. ఈ దండకం వింటున్నంత సేపూ అభిమానులు కేరింతలు కొట్టారు.

  • Loading...

More Telugu News