: 'ఐయాం ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే... ఐహ్యావ్ 101 ఫీవర్' అని ఆలీ అంటే, వెంటనే 'అరే మామా, ఏక్ పెగ్ లా' అని అందుకున్న బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం 'పైసా వసూల్'లో ఆయన స్వయంగా ఓ పాటను పాడిన సంగతి తెలిసిందే. గత రాత్రి చిత్ర, ఆడియో వేడుక జరుగుతున్న వేళ, బాలయ్య పాడిన పాట నేపథ్యాన్ని కమేడియన్ అలీ స్వయంగా వెల్లడించి అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు. ఈ చిత్రంలో 'అరె మామా ఏక్ పెగ్ లా...' అంటూ బాలయ్య పాట సాగుతుందని, అంతకన్నా ముందు తనకో డైలాగ్ ఉందని చెప్పాడు.
"ఐయాం ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే... ఐహ్యావ్ 101 ఫీవర్... మై నర్స్ టోల్డ్ మీ టేక్ మెడిసిన్"... తరువాత ఆయన అందుకుంటారు పాట అని వెల్లడించారు. పూరీ జగన్నాథ్ పాట పాడమని తనను అడిగితే తాను సరేనన్నానని బాలకృష్ణ చెప్పారు. తాను తన తండ్రి పాటలు, పాత పాటలను ఎక్కువగా వింటుంటానని, కొన్ని పాటలను బిగ్గరగా పాడుతూ ఉంటానని చెప్పుకొచ్చారు. 'జగదేక వీరుని కథ' చిత్రంలోని శివశంకరీ... పాటంటే తనకెంతో ఇష్టమని, దాన్ని స్టేజ్ పై పాడాలన్నది తన కోరికని అన్నారు. సంగీత దర్శకుడు రూబెన్స్, పూరీ సహకారంతో ఈ సినిమాలో పాటను గంటలో పాడేశానని అన్నారు.