: 'అన్యాయం..అక్రమం' అంటూ అమెరికా ప్రకటనపై ఆర్తనాదాలు చేస్తున్న పాకిస్థాన్


అన్యాయం.. దారుణం...అక్రమం అంటూ పాకిస్థాన్ ఆర్తనాదాలు చేస్తోంది. పాకిస్థాన్ ఇలా అకస్మాత్తుగా ఆర్తనాదాలు చేయడానికి కారణమేంటంటే... హిజ్బుల్ ముజాహిద్దీన్ పాకిస్థాన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ ను రెండు నెలల క్రితం అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో గగ్గోలు పెట్టిన పాకిస్థాన్ కు మరోసారి అలాంటి షాకే వచ్చింది. బుధవారం హిజ్బుల్ ముజాహిద్దీన్ ను కశ్మీర్‌ లో అల్లర్లు సృష్టిస్తూ హింసకు పాల్పడుతున్న విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.

 దీంతో పాకిస్తాన్ కి పుండు మీద కారం చల్లినట్టైంది. పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల కార్యాలయ అధికార ప్రతినిధి నసీఫ్ జకారియా మాట్లాడుతూ, కశ్మీర్ లో స్వేచ్ఛ కోసం పోరాడుతున్న సంస్థలు, గ్రూపులను ఉగ్రవాద సంస్థలుగా పేర్కొనడం పూర్తిగా అన్యాయమని గుండెలు బాదుకున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కశ్మీరీల స్వేచ్ఛ కోసం పోరాడుతానని ఉగ్రవాది సయ్యద్ సలాహుద్దీన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాక్ సైన్యం, గుఢచార సంస్థ ఐఎస్ఐ సహాయంతో కశ్మీర్ లో అల్లర్లకు హిజ్బుల్ ముజాహిద్దీన్‌ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News