: తండ్రికి రెండో స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చిన హార్దిక్ పాండ్య... వీడియో చూడండి!


టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్య తన తండ్రికి రెండో స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ తో అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్య మూడో టెస్టులో సెంచరీతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. దీంతో తన కొడుకు తనకు సెంచరీతో సర్ ప్రైజ్ చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ నెల 20 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విశ్రాంతి తీసుకుంటున్న హార్దిక్ పాండ్యా.. భారత్ లో ఉన్న తన సోదరుడు కృనాల్‌ పాండ్యతో కలిసి తన తండ్రికి సర్‌ ప్రైజ్‌ ఇచ్చాడు.

హార్దిక్‌-కృనాల్‌ తో తమకు సోదరుడి వరసయ్యే వైభవ్‌ సాయంతో తండ్రి హిమాన్షుని కార్ల షోరూంకి పంపించారు. వారిద్దరూ వెళ్లిన తరువాత వైభవ్ ఫోన్ కు హార్దిక్ వీడియో కాల్ లోకి వచ్చాడు. షోరూంలో నచ్చిన కారును ఎంపిక చేయమని హార్దిక్ తండ్రికి సూచించగా, ఆయన ఎందుకు? ఎవరికి? ఏంటి? అంటూ ఆరాలు తీయకుండా ఎరుపు రంగు కారు బాగుందని అన్నారు. ఇంతలో షోరూం సిబ్బంది 'ఆ కారు మీదే' అన్నారు. ఆయనకు ముందు విషయం అర్థం కాలేదు. కానీ నెమ్మదిగా అర్థమయ్యేసరికి ఆయనలో ఆనందం ఉప్పొంగింది. ఆన్ లైన్ లో ఉన్న హార్దిక్ తో 'ఐలవ్యూ' అన్నారు. అలా తన తండ్రి ముఖంలో సంతోషం చూడడం ఆనందంగా ఉందని హార్దిక్ అన్నాడు. ఆయన తమ ఇద్దరి కోసం చాలా సంతోషాలను వదులుకున్నారని హార్దిక్ తెలిపాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మీరు కూడా చూడండి.


  • Loading...

More Telugu News