: 'పైసా వసూల్'లో బాలయ్య పంచ్ డైలాగుల ప్రవాహం.. అదుర్స్ అంటున్న అభిమానులు!
సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న 'పైసా వసూల్' ఆడియో వేడుక అనంతరం బాలయ్య అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఈ సినిమాలో తనను దర్శకుడు పూరీ జగన్నాథ్, మోక్షజ్ఞ కంటే చిన్నవాడిలా భావించాడని చెప్పగానే బాలకృష్ణ అభిమానులు మురిసిపోయారు. 'ఈ సినిమా సూపర్ హిట్' అంటూ అభిమానులు అప్పుడే ఒక అంచనాకి వచ్చేశారు. కారణం ఈ సినిమాలో పూరీ మార్క్ పంచ్ డైలాగులు. ఈ డైలాగులు బాలయ్య స్లాగ్ లో అదిరిపోయాయని చెబుతున్నారు. వాటిల్లో కొన్ని డైలాగులు..
* ‘మేరా నామ్ తేడా.. తేడా సింగ్.. దిమాక్ తోడ.. చాలా తేడా.. 36 దోపిడీలు.. 24 మర్డర్స్.. 36 స్టాపింగ్‌లు.. దిస్ ఈజ్ మై విజుబుల్ రికార్డు ఇన్ వికీపీడియా’...
* ‘గొడవల్లో గోల్డ్ మెడల్ వచ్చిన వాడిని. మళ్లీ టోర్నమెంట్ లు పెట్టొద్దు’
* ‘వన్స్ నా స్క్రూ లూజ్ అయితే.. నేను ఇలాగే ఉంటా’
* ‘బిహార్ నీళ్లు తాగిన వాళ్లనే తీహార్ లో పోయించా. తు క్యారే హౌలే!’
* ‘ఓరే రామకృష్ణ థియేటర్ సందులో పెరిగాను. మనది నేల టికెట్ బ్యాచ్ ’
* ‘కసి తీరకపోతే శవాన్ని లేపి మరీ చంపేస్తా’