: బాలకృష్ణ స్పీడ్ చూస్తుంటే ఆయన మొదటి సినిమాలో నటిస్తున్నట్టు ఉంది!: దర్శకుడు పూరీ జగన్నాథ్


బాలకృష్ణ స్పీడ్ చూస్తుంటే  ఎలా ఉందంటే, ఆయన మొదటి సినిమాలో నటిస్తున్నట్టు ఉందని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. ‘పైసా వసూల్’ ఆడియో రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ, బాలకృష్ణతో మళ్లీ ఇంకో సినిమా చేయాలని ఉందని, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు సినిమా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. బాలకృష్ణ స్పీడ్ చూస్తుంటే మోక్షఙ్ఞ కన్నా చిన్నవాడిలా ఉన్నారంటూ పూరీ కితాబిచ్చారు. బాలయ్యకు బౌన్సర్లు అక్కర్లేదని, ఎందుకంటే, ఆయన అభిమానులను ఆయనే కంట్రోల్ చేయగలరని అన్నారు. ఈ సందర్భంగా, తన అభిమానిపై బాలయ్య చెంపదెబ్బ కొట్టిన సందర్భాన్ని పూరీ ప్రస్తావించారు. ఎంతో అభిమానం ఉంటేనే ఆయన అలా కొడతారని, దానిని అభిమానులు సీరియస్ గా తీసుకోకూడదంటూ పూరీ చెప్పుకొచ్చారు.
  

  • Loading...

More Telugu News