: అతి శక్తిమంతమైన 6 అపాచి హెలికాప్టర్ల కొనుగోలుకు డీపీసీ అనుమతి!
భారత్‌పై ఏ దేశమైనా దాడికి దిగితే దీటుగా జవాబు ఇవ్వడానికి సైన్యానికి అతి శక్తిమంతమైన 6 అపాచి హెలికాప్టర్లు అందనున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ కమిటీ (డీపీసీ) ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రక్షణ రంగ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.4100 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లోంచే ఈ ఆరు అతి శక్తిమంతమైన హెలికాప్టర్లను కొనుగోలు చేస్తున్నారు. అలాగే, మరికొన్ని ఆయుధాలను కూడా భారత్ పొందనుంది. ఆ ఆయుధాలను అమెరికాలోని బోయింగ్ మల్టీనేషనల్ కార్పోరేషన్ నుంచి భారత్ దిగుమతి చేసుకోనుంది.