: ‘పైసా వసూల్’ ఆడియో వేడుకకు వర్షంతో ఆటంకం!


ఖమ్మంలో జరుగుతున్న ‘పైసా వసూల్’ ఆడియో వేడుకకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. ఆడియో విడుదల కార్యక్రమానికి చిత్ర బృందం చేరుకున్న కొంచెం సేపటి తర్వాత వర్షం కురిసింది. దీంతో, కొంచెం సేపు బ్రేక్ ఇచ్చారు. కాగా, ఈ వేడుకకు విచ్చేసిన నటుడు బాలకృష్ణకు అభిమానుల ఘనస్వాగతం లభించింది. చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్, ఈ చిత్రంలో నటీనటులు శ్రియ, కైరాదత్, అలీ తదితరులు హాజరయ్యారు. కాగా, ఈ వేడుక సందర్భంగా  గాయనీ గాయకులు ఆలపించిన బాలకృష్ణ సినిమాలలోని పాటలు, ప్రత్యేక ప్రదర్శన ఆకట్టుకున్నాయి.

  • Loading...

More Telugu News