: ఉ.కొరియాపై యుద్ధం చేస్తే అమెరికా మమ్మల్ని సంప్రదించాల్సిందే!: దక్షిణ కొరియా
ఉత్తర కొరియా, అమెరికాల మధ్య పొంచి ఉన్న యుద్ధ భయం గురించి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేన్ స్పందిస్తూ ప్రస్తుతం ఆ భయం లేదని అన్నారు. ఉత్తర కొరియాపై ఎలాంటి మిలిటరీ చర్యలకు అమెరికా దిగబోదని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర కొరియా విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తమ దేశాన్ని సంప్రదించిన తరువాతే తీసుకుంటామని అమెరికా గతంలోనే హామీ ఇచ్చిందని అన్నారు. యుద్ధం జరిగే అవకాశం లేదన్న అంశాన్ని తమ దేశీయులు విశ్వసించాలని వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే, ఉత్తర కొరియాతో సత్సంబంధాల పునరుద్ధరణకు కృషి చేస్తామని అన్నారు.