: పద్మ అవార్డుల కోసం ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు: మోదీ
పద్మ అవార్డుల కోసం తాము ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ పౌరుడు తనకోసమైనా లేక ఎవరికోసమైనా పద్మ అవార్డు పొందేందుకు వివరాలు పంపించవచ్చని అన్నారు. ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజలు తమకు తెలిసిన గొప్ప వ్యక్తులను సిఫారసు చేయాలని అన్నారు. గతంలో రాజకీయ నాయకులు ప్రతిపాదిస్తేనే పద్మ అవార్డులు వచ్చేవని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. కాగా, దేశాభివృద్ధిలో దేశంలోని ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని మోదీ పిలుపునిచ్చారు.