: ఆడబిడ్డకు జన్మనిచ్చిందని... భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త!
మగపిల్లల కన్నా ఆడపిల్లలే బెస్ట్ అంటూ పలు సందర్భాల్లో రుజువవుతున్నప్పటికీ, పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నప్పటికీ కొందరు తండ్రుల తీరు మాత్రం మారడం లేదు. ఆడపిల్ల పుట్టిందంటేనే మండిపడిపోతున్నారు. ఆడపిల్ల పుట్టిందని ఓ భర్త తన భార్యను తుపాకీతో కాల్చి చంపేసిన ఘటన ఉత్తర ప్రదేశ్, బులంద్‌షెహర్‌లోని కొత్వాలీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆరిఫ్ దంపతులకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నిన్న ఆరిఫ్ భార్యకు మూడో కాన్పు జరిగింది. మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో ఆమెపై ఆరిఫ్ కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆమె కంట్లోంచి దూసుకెళ్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆరిఫ్ కుటుంబీకులు పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.