: హెలికాఫ్టర్ లో ఖమ్మంకి బయలుదేరిన ‘పైసా వసూల్’ టీమ్.. బాలయ్యతో నటుల సెల్ఫీలు చూడండి!
బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న 'పైసా వసూల్' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మరికాసేపట్లో ఖమ్మంలో ప్రారంభం కానుంది. ఈ చిత్ర బృందం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో ఖమ్మం బయలుదేరింది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ జర్నీలో నటులు సందడి చేశారు. హెలికాఫ్టర్‌లో బాలకృష్ణ, శ్రియాలు పక్కన కూర్చుండగా ఛార్మీ సెల్ఫీ తీసుకుని తెగ సంబరపడిపోయింది. ఈ సినిమా బృందంతో పాటు దర్శకులు బోయపాటి శ్రీను, క్రిష్ కూడా ఆడియో ఫంక్షన్ కు వెళుతున్నట్లు తెలుస్తోంది. హెలికాఫ్టర్ ఎక్కే ముందు వీరంతా కలిసి ఓ గ్రూప్ ఫొటో కూడా తీసుకున్నారు. హెలికాఫ్టర్ లో నటులంతా సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు.