: భారత్ ను మరోసారి రెచ్చగొట్టిన చైనా.. డోక్లాంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు!
డోక్లాం స్లాండాఫ్ నేపథ్యంలో భారత్-చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత్ ను ప్రతి రోజూ ఏదో ఒక రకంగా రెచ్చగొట్టేందుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నిస్తోంది. తాజాగా డోక్లాం ప్రాంతంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించింది. హునాన్ ప్రావిన్స్ లోని చాంగ్షాలో ఉన్న ఓ ఆసుపత్రి... చైనా సైన్యం ఆదేశాలతో తన బ్లడ్ బ్యాంక్ ను డోక్లాం ప్రాంతానికి తరలించిందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ నివేదించింది. మరోవైపు, భారత సైన్యం వెనక్కి వెళ్లాలంటూ త్వరలోనే అల్టిమేటం జారీ చేస్తామని... వినకపోతే చర్యలు తప్పవని చైనా హెచ్చరించిన సంగతి తెలిసిందే.