: రామోజీ ఫిలిం సిటీలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం... రామోజీరావుతో భేటీ!
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమా ఖండూ నేడు రామోజీ ఫిలిం సిటీని సందర్శించారు. అనంతరం రామోజీ సంస్థల అధినేత రామోజీరావుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఫెమా ఖండూతో పాటు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ లు కూడా రామోజీని కలిశారు. ఫిలిం సిటీ తీరుతెన్నులను రామోజీరావును అడిగి ఖండూ తెలుసుకున్నారు. పర్యాటకానికి అరుణాచల్ ప్రదేశ్ ఇస్తున్న ప్రాధాన్యత, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకానికి ఉన్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా రామోజీకి వివరించారు.