: కాకినాడ ఎన్నికలకు పచ్చజెండా ఊపిన హైకోర్టు


కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కార్పొరేషన్ లో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ ల ఖరారును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 48 వార్డులకే ఎన్నికలను జరుపుతున్నారని...  మొత్తం 50 వార్డులకు ఎన్నికలను నిర్వహించాలని పిటిషన్ దారుడు కోరాడు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News