: కాకినాడలో కనిపించని సైకో
మంచి నిద్రలో ఉన్నారు.డబేల్ డబేల్ మంటూ తలుపు చప్పుడు. ఉలిక్కిపడి లేచారు. భయంతో, ధైర్యాన్ని కూడదీసుకుని వెళ్లి తలుపు తీసి చూస్తే ఎవరూ కనిపించరు. మళ్లీ తలుపు మోగుతుంది. ప్రాణం పోయినంత పని. ఇలాంటి భయంకర అనుభవాలు గత కొన్ని రోజులుగా కాకినాడ పట్టణ వాసులకు ఎదురవుతున్నాయి. ఇదంతా సైకో పనిగా భావిస్తున్నారు. ఇలాంటి భయంకర అనుభవాలు చాలా మందికి ఎదురయ్యాయి. దీంతో స్థానిక యువకులు కర్రలు, రాడ్లతో రాత్రి అయిన తర్వాత కాపలా కాస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాకినాడ పట్టణంలో గత అర్ధరాత్రి దమ్ములపేటలో భయానక పరిస్థితి నెలకొంది. సైకో అన్న అనుమానంతో స్థానికులు శ్రీలంక మత్స్యకారులను చితగ్గొట్టారు. ఐదుగురు మత్స్యకారులకు గాయాలవ్వగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.