: ‘జనసేన’ అనుబంధ సంఘాలు త్వరలో ఏర్పాటు చేస్తాం: పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అనుబంధ సంఘాలు త్వరలో ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనసేన విద్యార్థి, మహిళ విభాగాలు ఏర్పాటు చేస్తామని, త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని, ఈ ఏడాదిలోపే వీటిని ఏర్పాటు చేస్తామని జనసేన పార్టీ ట్విట్టర్ ఖాతా ద్వారా పవన్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశారు. కాగా, నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని, తాము తటస్థం అని పవన్ కల్యాణ్ నిన్న స్పష్టం చేశారు.