: సన్నీ లియోన్‌ను చూడటానికి భారీగా తరలివచ్చిన జనం!
కొచ్చిలో ఓ మొబైల్ కంపెనీ ఆవిష్కరణ కోసం వచ్చిన బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌ను చూడటానికి జనం భారీగా తరలి వచ్చారు. వచ్చిన జనాన్ని చూసి సన్నీ ఆశ్చర్యపోయింది. వారు చూపిస్తున్న ప్రేమకు, అభిమానానికి ఆమె ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేసింది. కొచ్చిలోని ఎంజీరోడ్‌లో `ఫోన్4 డిజిటల్ హబ్` ప్రారంభోత్సవానికి సన్నీ హజరైంది. ఆమె రావటం ఆలస్యమవుతుందని తెలిసినా సన్నీ కోసం గంటల తరబడి అభిమానులు ఎదురుచూశారని నిర్వాహకులు తెలిపారు. ఆమె వచ్చాక అభిమానులంతా `వియ్ లవ్ సన్నీ` అంటూ నినాదాలు కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సన్నీ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. `కేరళ అభిమానులు చూపించిన ప్రేమను నా జీవితంలో మర్చిపోలేను` అంటూ సన్నీ లియోన్ ట్వీట్ చేసింది.