: టీడీపీకి జ్యోతుల చంటిబాబు గుడ్‌ బై!


తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట టీడీపీ నియోజకవర్గ నాయకుడు జ్యోతుల చంటిబాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ సభ్యత్వానికి, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవికి చంటిబాబు రాజీనామా చేశారు. కాగా, టీడీపీ నుంచి చంటిబాబు బయటకు రావడంపై పలు కథనాలు వినపడుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు జ్యోతుల నవీన్ కారణంగా పార్టీలో చంటిబాబు ఇమడలేకపోయారని తెలుస్తోంది.

అంతేకాకుండా, చంటిబాబు తండ్రి మృతి చెందిన సమయంలో టీడీపీ నేతలు ఎవ్వరూ కనీసం సానుభూతి కూడా తెలపలేదని, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు ప్రారంభించిన రోజున చంటిబాబుకు ఆహ్వానం అందకపోవడం వంటి కారణాలతో చంటిబాబు అసహనంగా ఉన్నారని, ఈ నేపథ్యంలోనే టీడీపీకి గుడ్ బై చెప్పారని తెలుస్తోంది. కాగా, భవిష్యత్ కార్యాచరణ విషయమై తన మద్దతు దారులతో చంటిబాబు మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News