: ఎన్నికలు వాయిదా వేయించాలని వైసీపీ చూస్తోంది.. అప్రమత్తంగా ఉండండి: చంద్రబాబు
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ రోజు తమ పార్టీ ముఖ్య నేతలు, సమన్వయ కమిటీతో భేటీ అయిన చంద్రబాబు... టీడీపీ నేతలకు, ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎన్నికలు వాయిదా వేయించాలని వైసీపీ చూస్తోందని, ఆ పార్టీ తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కుల, మత, ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలని వైసీపీ ప్రయత్నిస్తోందని తెలిపారు. ఓటమి భయంతో వైసీపీ శాంతి భద్రతల సమస్యను కూడా సృష్టించాలని చూస్తోందని ఆయన చెప్పారు.