: రూటు మార్చిన పన్నీర్ సెల్వం.. కమల్ మద్దతు కోరిన వైనం!
ఢిల్లీలోని బీజేపీ పెద్దలు కల్పించుకున్నప్పటికీ విలీనం విషయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. తాను పెట్టిన రెండు డిమాండ్లకు సంబంధించి సీఎం పళనిస్వామి ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడంతో విలీనం దిశగా ఇంకా అడుగులు పడలేదు. దీంతో, పన్నీర్ సెల్వం రూటు మార్చారు. గత కొంత కాలంగా తమిళనాడులో మంచి ప్రభుత్వం ఉండాలని డిమాండ్ చేస్తున్న ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ తమకు మద్దతు ఇవ్వాలని పన్నీర్ వర్గంలోని కీలక నేత పాండియరాజన్ విన్నవించారు. తాము చేస్తున్న ధర్మ యుద్ధానికి కమల్ మద్దతు ఇస్తే తమిళనాడు ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన అన్నారు.
మరోవైపు అన్నాడీఎంకే పార్టీకి శశికళ కుటుంబసభ్యులను దూరం పెట్టాలని... జయ మృతిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలనే డిమాండ్లను పళనిస్వామి ముందు పన్నీర్ వర్గం ఉంచిన సంగతి తెలిసిందే.