: హీరోయిన్ ప్రియమణి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది!


దక్షిణాది హీరోయిన్ ప్రియమణి వివాహం తన ప్రియుడు ముస్తఫారాజ్ తో ఈ నెల 25న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రియమణి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. మూడు రోజుల పాటు జరగనున్న పెళ్లి వేడుకల్లో మెహందీ, సంగీత్, కాక్ టెయిల్ పార్టీ, రిసెప్షన్ జరగనున్నాయి. అయితే, వీరి వివాహానికి చాలా సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరగనున్నట్టు సమాచారం.

 కాగా, ఈవెంట్ మేనేజ్ మెంట్ బిజినెస్ నిర్వహిస్తున్న ముస్తఫారాజ్ తో గత ఐదేళ్లుగా ప్రియమణి  ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఓ సారి ఐపీఎల్ మ్యాచ్ లో ముస్తఫారాజ్ తో ప్రియమణికి ఏర్పడ్డ పరిచయం కాస్తా క్రమక్రమంగా ప్రేమగా మారింది. గత ఏడాది మే 27న వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఎంగేజ్ మెంట్ తర్వాత నుంచి వీరిద్దరూ కలిసే ఉంటున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News