: గంగులకు వైసీపీలో సభ్యత్వం కూడా లేదు: భూమన
వైసీపీ నేత గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరినా వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రతాప్ రెడ్డికి వైసీపీలో సభ్యత్వం కూడా లేదని అన్నారు. ఆయన సోదరుడు గంగుల ప్రభాకర్ రెడ్డి మాత్రం తమ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికతో తమ అధినేత జగన్ ఇమేజ్ తార స్థాయికి చేరిందని తెలిపారు. నంద్యాల ఓటర్లు జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. శిల్పా మోహన్ రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటలను నమ్మే పరిస్థితిలో జనాలు లేదని చెప్పారు.