: ఇండియాపై చైనా 'తీన్మార్' టీవీ షో ఇది... భారత్ ఏడు పాపాలు చేసిందట!


డోక్లాంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చైనా అధికారిక న్యూస్ ఏజన్సీ 'క్సిన్సువా' ఓ 'తీన్మార్' షోను ప్రసారం చేసింది. భారత్ ఏడు పాపాలు చేసిందని ఆరోపిస్తూ, '7 సిన్స్ ఆఫ్ ఇండియా: ఇట్స్ టైమ్ ఫర్ ఇండియా టూ కన్ఫెస్ ఇట్స్ సెవెన్స్ సిన్స్' పేరిట ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఓ సిక్కు వేషధారణలో ఉన్న వ్యక్తిని చూపిస్తూ, అతను ఇండియా గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్టు చూపింది. నిస్సందేహంగా చైనాకు చెందిన డోక్లామ్ ప్రాంతంలో భారత సరిహద్దు దళాలు వచ్చి తిష్ట వేశాయని, చైనా బలాన్ని తక్కువగా అంచనా వేస్తున్నాయని ఆరోపించింది.

 భారత్ ఏడు పాపాలు ఇవేనంటూ, చొరబాటు, ద్వైపాక్షిక నిబంధనల అతిక్రమణ, అంతర్జాతీయ చట్టాలను పాటించకపోవడం, అంతర్జాతీయంగా అయోమయం కలిగించడం, బాధితుడిపైనే తప్పును నెట్టివేసే ఆలోచన, పొరుగున ఉన్న చిన్న దేశాలను భయాందోళనలకు గురిచేస్తుండటం, తెలిసి కూడా తప్పు చేయడం వంటివి చేస్తోందని పేర్కొంది. భూటాన్ ను భయపెట్టి చైనాకు వ్యతిరేకంగా మారుస్తోందని ఆరోపించింది. జరుగుతున్న ఘోరాన్ని చూసి చైనా ఊరికనే ఉండదని హెచ్చరించింది. బ్రిటీష్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, డోక్లామ్ తమదేనని స్పష్టం చేసింది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News