: రోడ్డు షోలో డబ్బులు పంచుతున్న బాలయ్య... ఫోటో చూడండి!


నంద్యాల ఎన్నికల ప్రచారానికి వచ్చి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, తన వాహనంపై నుంచి కింద చేతులు చాచి నిలుచున్న కొంతమందికి వంద రూపాయల నోట్లు స్వయంగా అందజేస్తున్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. నిన్న ఓపెన్ టాప్ వాహనంపై భూమా బ్రహ్మానందరెడ్డికి ఓటు వేయాలని ప్రచారం చేసిన ఆయన, అదే వాహనంపై ఉన్న అఖిలప్రియ మాట్లాడుతున్న వేళ, కొంతమందికి డబ్బులు ఇస్తూ కెమెరా కంటికి దొరికారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతుండగా, విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా వెళ్లింది. బాలయ్య డబ్బులు పంచారన్న విషయాన్ని ఈసీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఆ ఫోటో ఇదే.

  • Loading...

More Telugu News