: ఐన్‌స్టీన్‌ని మించిన జ్ఞానంతో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిన‌ భార‌త సంత‌తి బాలుడు... ఒక్క‌రాత్రిలో బ్రిట‌న్ టీవీ సెల‌బ్రిటీగా మారిన వైనం!


బ్రిటన్‌లో ప్ర‌సార‌మ‌య్యే ఓ టీవీ షోలో పాల్గొన్న 12 ఏళ్ల భారత సంతతి బాలుడు ఒక్కరాత్రిలో సెల‌బ్రిటీగా మారిపోయాడు. అక్క‌డి ఛానల్‌ 4లో ప్రసారమ‌వుతున్న‌ ‘చైల్డ్‌ జీనియస్‌’ కార్యక్రమంలో తొలిరౌండ్‌లో భార‌త సంత‌తి బాలుడు రాహుల్‌ 14 ప్రశ్నలకు సరైన‌ సమాధానమిచ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.  రాహుల్ ఐక్యూ పాయింట్ల విలువ 162. ఇది ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త‌లు ఐన్‌స్టీన్‌, స్టీఫెన్ హాకింగ్‌ల కంటే ఎక్కువ‌. వారం పాటు జ‌ర‌గనున్న‌ ఈ పోటీలో 8–12 ఏళ్ల వ‌య‌సున్న‌ 20 మంది బాలలు పాల్గొంటున్నారు. వీరిలో ఒకరిని మాత్రమే విజేతగా ప్రకటిస్తారు. తొలిరౌండ్‌లో జ‌రిగిన స్పెల్లింగ్‌ టెస్ట్‌లో రాహుల్‌ పూర్తి మార్కులు పొందగా, జ్ఞాపక శక్తి పరీక్షలో 15 ప్రశ్నల్లో 14 ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పాడు.

  • Loading...

More Telugu News