: పెళ్లికి వయసుతో సంబంధం లేదు... నిరూపించిన వృద్ధ జంట!
చత్తీస్‌గఢ్‌లోని బాగ్దోల్ గ్రామంలో ఆగస్టు 16న కుటుంబ సభ్యుల సమక్షంలో 75 ఏళ్ల రాతియా రామ్, 70 ఏళ్ల జిమ్నాబరీ బాయి మెడలో మూడు ముళ్లు వేయడంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. తాళి కట్టడానికి శరీరం సహకరించకపోతే, రాతియా రామ్ తన మనవడి సహకారం తీసుకున్నాడు. కొర్వా తెగకు చెందిన వీరిద్దరూ 15 రోజుల క్రితం ఓ వేడుకలో కలుసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తున్న రాతియా రామ్, తనలాగే ఒంటరి అయిన జిమ్నాబరీని తనతో కలిసి జీవించమని అడిగాడు. ఈ మాటలకు జిమ్నాబరీ కొంత తటపటాయించడంతో గ్రామ ప్రజల కోసం తనను పెళ్లి చేసుకుంటానని రాతియా రామ్ మాటిచ్చాడు. తర్వాత వీరి నిర్ణయానికి గ్రామ పంచాయతీ, కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభించడంతో వారిద్దరూ ఒక్కటయ్యారు.